ఊహకందని ప్రేమలోన భావమే నీవు Song Lyrics | Oohakandani Prema Song Lyrics Telugu | Hosanna Ministries | Pas. John Wesley
Oohakandani Prema Song Lyrics :-
ఊహకందని ప్రేమలోన భావమే నీవు
హృదయమందు పరవసించు గానమే నీవు
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులే నీవు
ఎడబాయలేనన్నా నిజస్నేహమే నీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు
( ఊహకందని )
చరణం :- 1
తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి
తనువుతీరే వరకు నన్ను విడువలేనంది (2)
అదియే..ఆ ఆ ఆ – నే గాయపరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చి
ఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన
నీ అమరమైన ప్రేమయే (2)
( ఊహకందని )
చరణం :- 2
నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా (2)
అదియే..ఆ ఆ ఆ తన మహిమ విడిచిన
త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు
నను హత్తుకున్న స్వామివి (2)
( ఊహకందని )
చరణం :- 3
దేహమందు గాయమైతే కుదుటపడును కదా
గుండె గాయము గురుతుపట్టిన నరుడు లేడుకదా (2)
నీవే నీవే యేసయ్య
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు
ననుభుజముపైన మోసిన
అలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో
విలువంటూ లేనే లేదయ్యా (2)
( ఊహకందని )
English Lyrics :-
Oohakandani Premaalona
Oohakandani Premaalona Bhaavame Neevu
Hrudayamandu Paravasinchu Gaaname Neevu
Manasu Nindina Ramyamaina Gamyame Neevu
Marapurani Kalala Saudham Guruthule Neevu
Edabaayalenannaa Nijasneham Neevu
Nee Prema Kaugililo Aanandame Neevu
(Oohakandani)
Charanam 1:
Talladille Talli Kanna Minchi Preminchi
Tanuvu Theere Varaku Nannu Viduvalenandi (2)
Adiye.. Aa Aa Aa – Nee Gaayaparachina Velalo
Kanneeru Karchina Premagaa
Nulivechchanaaina Odiki Cherchi
Aadarinchina Premaye
Nee Gundelo Nanu Cherchina
Nee Amaramaaina Premaye (2)
(Oohakandani)
Charanam 2:
Ningi Nelanu Kalipina Balamaaina Vaaradhiga
Nelakorigina Jeevitanni Levanettenuga (2)
Adiye.. Aa Aa Aa Tana Mahima Vidichina
Tyagamu Ee Bhuviki Vachchina Bhaagyamu
Nanu Datipoka Vedakina Nee Madhuramaaina Premaye
Nee Sarvamichchina Daathavu
Nanu Hattukunna Swaamivi (2)
(Oohakandani)
Charanam 3:
Dehamandu Gaayamaite Kudutupadunu Kada
Gunde Gaayamu Guruthupattina Narudu Ledukada (2)
Neeve Neeve Yesayya
Naa Antharangamu Tharachi Choosina
Gaadhaamaaina Premavu
Nanubhujamupaina Mosina
Alasiponi Premavu
Neevu Lenide Naa Brathukulo
Viluvantu Lene Ledayya (2)
(Oohakandani)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jaya Sankethama Song Lyrics :- Click Here