ఒంటరి పయనంలో Song Lyrics in telugu | Ontari Payanamlo Song Lyrics in telugu | A.R Stevenson | Lyrics by Pas.Shadrak | Christian Song 2024
ఒంటరి పయనంలో Song Lyrics
పల్లవి :
ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
అందరు నను విడిచి దూరంపోతున్నా (2)
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా (2)
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
చరణం :- 1
ఏడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై (2)
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా (2)
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
చరణం :- 2
దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై (2)
ఆశే ఇంక లేకున్నా ధైర్యమే మిగులకున్నా (2)
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
చరణం :- 3
ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై (2)
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మీగులకున్నా (2)
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yehovaa naa Deva :- Click Here