నను కలుగజేసిన song Lyrics Telugu | NANU KALUGAJESINA Song Lyrics in Telugu | Dr. A R Stevenson Songs | Latest Telugu Christian Song 2024
NANU KALUGAJESINA Song Lyrics :-
నను కలుగజేసిన – విధము తలపోసిన
భయము ఆశ్చర్యము పుట్టును – హృదయమందున
అ.ప:
స్తుతులు చెల్లించుచున్నా – అందువలన (2)
చరణం :- 1
తన స్వరూపమున నరుని నిర్మించిన
అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన (2)
దేవుడు తనకంటే కొంతే
నను తక్కువగాను చేసెను (2)
ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన
( స్తుతులు చెల్లించుచున్నా )
చరణం :- 2
మంటిదేహమున మహిమను నింపిన
శ్రేష్టమైన వైభవమును ధరియింపజేసిన (2)
దేవుడు తన గ్రంధమునందు
నా దినములు రాసియుంచెను (2)
ఇంత ప్రేమానురాగం ఏలనో నాపైన
( స్తుతులు చెల్లించుచున్నా )
చరణం :- 3
ఘనపరచదగిన మన ప్రభువు చేసిన
దివ్యమైన ఆకసమును తారలను చూచిన
దేవుడు నను దర్శించుటకు
నరుడను ఏపాటివాడను (2)
ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోన
( స్తుతులు చెల్లించుచున్నా )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Pranthi Dinamu Song :- Click Here