ఆశ తండ్రి ఆశ Song Lyrics Telugu | Aasha Thandri Aasha Song Lyrics in Telugu | 2024 Latest Telugu Christian Song | VKR Songs | Song No:66
Aasha Thandri Aasha Song Lyrics :-
పల్లవి :-
ఆశ తండ్రి ఆశ
ఆశ దేవుని ఆశ (2)
పరిశుద్దునిగా తను నిన్ను చూడాలని
నిర్దోషినిగా తన ఎదుట నిలవాలని (2)
జగతికి ముందే నీవు కావాలని
తన సంకల్పం నెరవేర్చాలని
ప్రేమగల తండ్రి ఆశ
క్రీస్తులో తండ్రి ఆశ
చరణం :- 1
గర్భములో నీవు పడక ముందే
పిండముగా నీవు మారకముందే (2)
అవయువములు రూపింపకముందే
ఆయువు నీకు ఇవ్వకముందే (2)
నిన్ను చూడాలని – ఆశ తీర్చాలని
నీవు కావాలని – తనతో నడవాలని
ప్రేమగల తండ్రి ఆశ
క్రీస్తులో తండ్రి ఆశ
( ఆశ తండ్రి ఆశ )
చరణం :- 2
తరతరములలో యుగయుగములలో
మనుష్యులు జననం తన సంకల్పం (2)
ప్రధమ ఫలముగ నిను ఎంచుకుని
ప్రత్యేకముగా ఏర్పరచుకుని (2)
సత్క్రియలు చేయాలని – క్రీస్తుల బ్రతకాలని
కృపను పొందాలని – ప్రేమను పంచాలని
ప్రేమగల తండ్రి ఆశ
క్రీస్తులో తండ్రి ఆశ
( ఆశ తండ్రి ఆశ )
చరణం :- 3
తన తనయులుగా కొందరినేర్పరచి
తలిదండ్రులకు తనయులుగా ఇచ్చి (2)
తన చిత్తమును జరిగించుటకు
తన మార్గము ఇల వేయుట కొరకు (2)
నీవు కావాలని – ఎదురు చూచాడని
జననమిచ్చాడని – తెలుసుకోవాలని
ప్రేమగల తండ్రి ఆశ
క్రీస్తులో తండ్రి ఆశ
( ఆశ తండ్రి ఆశ )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Neeve Neeve Song Lyrics :- Click Here