గతకాలము నీ కృపలో Christian Song Lyrics | Gathakalamu Nee Krupalo Song Telugu Lyrics | Sireesha Bhagavathula | Johnson Kanakala
Gathakalamu Nee Krupalo Song :-
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి (2)
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా (2)
నా దేవా – నీకే వందనం
నా ప్రభువా – నీకే స్తోత్రము
నా దేవా – నీకే వందనం
నా ప్రభువా – నీకే స్తోత్రము
నా ప్రభువా – నీకే స్తోత్రము
చరణం :- 1
కష్టాలు తీరక – కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా
నష్టాల బాటలో – నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా (2)
ఏ భయము నను ఆవరించక
ఏ దిగులు నను క్రుంగదీయక (2)
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
( నా దేవా – నీకే వందనం )
చరణం :- 2
కాలాలు మారగా – బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో – నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా (2)
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు (2)
( నా దేవా – నీకే వందనం )
చరణం :- 3
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా (2)
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా
నీ సేవలోనే బ్రతికించుమయా (2)
( నా దేవా – నీకే వందనం )
English Lyrics :-
Gathakaalamu Nee Krupalo Nanu Rakshinchi
Dinadinamuna Nee Dayalo Nanu Brathikinchi (2)
Nee Kanikaramē Nāpai Choopinchi
Nee Rekkala Chaatuna Aashrayamichchaavayaa
Naa Sthitigathulē Mundē Neeverigi
Ye Koduve Lēkundaa Aashirvaadinchaavayaa (2)
Naa Devaa – Neekē Vandanam
Naa Prabhuvaa – Neekē Stotramu
Naa Devaa – Neekē Vandanam
Naa Prabhuvaa – Neekē Stotramu
Naa Prabhuvaa – Neekē Stotramu
Charanam 1:
Kashtālu Teeraka – Kannīllu Aagaka
Dinamantaa Vedanalō Nēnundaga
Nashtāla Baatalō – Naa Brathuku Sāgaka
Gathamantaa Shodhanalō Padiyundaga (2)
Ye Bhayamu Nanu Aavarinchaka
Ye Digulu Nanu Krungadiyaka (2)
Naathooneedavai Nilichaavu
Naa Cheyi Patti Nadipinchaavu
(Naa Devaa – Neekē Vandanam)
Charanam 2:
Kaalālu Maaraga – Bandhālu Veedaga
Lokāna Ontarinai Nēnundaga
Naa Vyaadhi Baadhalō – Naa Dhukhadinamulō
Jeevithamē Bhaaramutho Brathikundaga (2)
Arachētulō Nannu Dāchina
Kanupaapalu Nannu Kachina
Nee Chelimithonē Nanu Pilichaavu
Naa Chētha Chēri Preminchaavu (2)
(Naa Devaa – Neekē Vandanam)
Charanam 3:
Oohinchalēdugaa Ee Sthithini Pondaga
Naa Manasu Paravashamai Stuthi Paadaga
Innālla Naa Kala Neravēruchundaga
Naa Swaramu Nee Varamai Koniyaadaga (2)
Neevichchinadē Ee Jeevitham
Nee Kosamē Idi Ankitham
Nee Aathmathonē Nanu Nimpumayaa
Nee Sevalōnē Brathikinchumayaa (2)
(Naa Devaa – Neekē Vandanam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Yesayya Song Lyrics :- Click Here