కృప లేక నేను Christian Song Lyrics | Krupa Leka Nenu Song Telugu Lyrics | Jesus My Only Hope | Bro. Anil Kumar | Telugu Christian Song 2024
Krupa Leka Nenu Song Lyrics :-
కృప లేక నేను జీవించలేను
కృప లేని నన్ను ఊహించలేను
కృపలోనే నేను మునిగియున్నాను
కృపలోనే నేను తేలుతున్నాను
కృపనే శ్వాసగా జీవిస్తున్నాను
కృప వెంట కృప నేను పొందుతున్నా!
మహిమ నుండి మహిమలోకి గెంతుతున్నా!
చరణం :- 1
ప్రేమతో ప్రభు నాకిచ్చాడుగా
తన స్వరూపము, తన పోలిక
పాపములో నే పడియుండగా
నను మధ్యలో వదిలేయ్ లేదుగా
శత్రువునైయున్న నా కోసము
దివినుండి భువికొచ్చెగా!
నను తప్పింపను నా బదులుగా
తానే బలైనాడుగా!
కృపలోనే నన్ను కలుసుకున్నాడు
కృపతోనే నన్ను కౌగలించినాడు
కృపతోనే ప్రభు నన్ను ముద్దాడినాడు
చరణం :- 2
నే పొందిన ఈ ఘన రక్షణ
నా క్రియ మూలముగా కాదుగా
రక్షణ దేవుని వరమే కదా
నీతి దానం ఉచితం కదా
సత్ క్రియలు నా చేత చేయించును
నే పొందిన ఈ కృప!
ప్రయాసపడుతుంది నే కాదుగా
నాకున్న దేవుని కృప!
కృపతోనే నేను నిండియున్నాను
కృపలోనే నేను ఎదుగుచున్నాను
కృపలోనే అభివృద్ధి పొందుతూ ఉన్నాను
చరణం :- 3
పాపమునకు నాపై ఉండిన
ప్రభుత్వమును కొట్టివేసిందిగా!
పాపపు క్రియలు అన్నింటిని
అసహ్యింపగ నను మార్చిందిగా
ఇహలోక సంబంధ దురాశను విసర్జింప నేర్పిందిగా!
సద్భక్తి నీతి స్వస్థబుద్దితో బ్రతుకుటకు బోధించెగా!
కృపను నేను వ్యర్ధపరచను
కృపలోనే నేను నిలిచియుందును
కృప మహిమకే కీర్తి చెల్లిస్తున్నాను
చరణం :- 4
నను బాధించెడి ప్రతి ముల్లును
అధిగమించేందుకు ప్రభువిచ్చెను
బలహీనతలో ప్రభు శక్తిని పరిపూర్ణము
నాలో చేయించును
బలహీనతలో మరియెక్కువ
హర్షిస్తా కృప ఉందని
నేనేమైయున్నానో అది దేవుని
కృప వలనే అయియుంటిని
కృపలోనే నేను బలవంతుడను
కృపలోనే నేను ధనవంతుడను
కృపను చూచి నే సంతోషిస్తున్నాను
చరణం :- 5
నాకివ్వబడిన కృప చొప్పున
కృపావరములను కలిగుంటిని
దేవుని కృపావరము చొప్పున
సువార్తకు పరిచారకుడైతిని
నానావిధమైన కృప విషయమై
గృహనిర్వాహకుడైతిని!
కృపకు మరి కృపావాక్యానికే
అప్పగింపబడితిని!
కృపతోనే నన్ను పిలిచియున్నాడు
కృపలొనే నన్ను ఏర్పరచినాడు
కృపావాక్యమునకు సాక్షిగా చేశాడు
చరణం :- 6
అనుదినము కృప పొందేందుకు
చేరెద దేవుని కృపాసనం
కృపను బట్టియే నా హృదయము
స్థిరపరచుకొనెద అనునిత్యము
దేవుని ప్రతి ఒక్క వాగ్దానము
కృపననుసరించే గదా!
శుభప్రదమైయున్న నిరీక్షణ
కృప నాకు యిచ్చిందిగా!
కృపయే నాకు నిత్యాదరణ
కృపయే నాకు నిత్య రక్షణ
కృప అంటే ఎవరో కాదు నా యేసు ప్రభువే!
English Lyrics :-
Krupa leka nenu jeevinchalenu
Krupa leni nannu uhinchalenu
Krupalone nenu munigiyunnanu
Krupalone nenu telutunnanu
Krupa ne svasaga jeevistunnanu
Krupa venta krupa nenu pondutunnanu!
Mahima nundi mahimaloki gentutunnanu!
Charanam – 1
Prematho Prabhu nakichhaduga
Tana svaroopamu, tana polika
Papamulo ne padiyundaga
Nanu madhyaloni vadileyaleduga
Shatruvnaiyunna na kosamu
Divinundi bhuvikocheduga!
Nanu tappinpanu na baduluga
Tane balainaduga!
Krupalone nannu kalusukunnadu
Krupatone nannu kougalinchinadu
Krupatone Prabhu nannu muddadinadu
Charanam – 2
Ne pondina ee ghana rakshana
Na kriya moolamuga kaaduga
Rakshana devuni varame kada
Neeti danam uchitam kada
Sat kriyalu na cheta cheyinchunu
Ne pondina ee krupa!
Prayasapaduthundhi ne kaaduga
Nakunna devuni krupa!
Krupatone nenu nindiyunnanu
Krupalone nenu eduguchunnanu
Krupalone abhivrudhi pondutunnanu
Charanam – 3
Papamunaku napai undina
Prabhutvamunu kottivesinduga!
Papapu kriyalu annitini
Asahyimpaga nanu marchinduga
Ihaloka sambandha durashanu visarjimpuneerpinchuga!
Satbhakti neeti swasthabuddhitho bratukutanga bodhinchaga!
Krupanu nenu vyardhaparachanu
Krupalone nenu nilichiyundunu
Krupa mahimake keerthi chellistunnanu
Charanam – 4
Nanu badhinchedi prati mullunu
Adhigaminchenduku Prabhu icchenu
Balheenathalo Prabhu shaktini paripoornamu
Nalo cheyinchunu
Balheenathalo mari ekkuva
Harshistha krupa undani
Nenemaayunnano adi devuni
Krupa valane ayi yuntini
Krupalone nenu balavanthudanu
Krupalone nenu dhanavanthudanu
Krupanu choochi ne santhoshistunnanu
Charanam – 5
Naku ivvabadina krupa choppuna
Krupavaramulanu kaliguntini
Devuni krupavaramu choppuna
Suvartaku paricharakudaitini
Nanavidhamaaina krupa vishyamai
Gruhanirvahakudaitini!
Krupaku mari krupavakyanike
Appagimpabaditini!
Krupatone nannu pilichiyunnadu
Krupalone nannu erparachinadu
Krupavakyanunaku sakshiga chesadu
Charanam – 6
Anudinam krupa pondenduku
Chereda devuni krupasanam
Krupanu battiyenena hrudayamu
Sthiraparachukone anu nityamu
Devuni prati okka vagdanamu
Krupananusarince gada!
Shubhapradamaaiyunna nireekshana
Krupa naku ichinduga!
Krupaye naku nityadarna
Krupaye naku nitya rakshana
Krupa ante evaro kaadu na Yesu Prabhave!
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Yesayya Song Lyrics :- Click Here