నా దేవుడు గొప్పవాడు Christian Song Lyrics | Naa Devudu Goppavadu Song Lyrics Telugu | Jesus My Only Hope | Bro. Anil Kumar
Naa Devudu Goppavadu Song Lyrics :-
నా దేవుడు గొప్పవాడు
ఏదైనా చెయ్యగలడు
ప్రభువెపుడు ఓడిపోడు
ఓడిపోడు ఓడిపోడు
సరియైన సమయమందే
రంగంలో దూకుతాడు
ముందు రాడు – ఆలస్యమవ్వడు
ముందు రాడు – ఆలస్యమవ్వడు
భవిష్యత్ ఏమౌతుందోనన్న
భయము లేదు నాకు!
రేపు ఏ మలుపు ఉందోనన్న
చింత లేదు నాకు!
అరె! నా జీవితం – ప్రభుని చేతిలో (2)
ఉంచి నేను నిశ్చింతగా ఉన్నా
చరణం :- 1
నేనేమి అవ్వవలెనో
ఖచ్చితంగా తెలిసినోడు
ముందే నిర్ణయించినాడు!
నన్నేమి చెయ్యవలెనో
ప్రభు చేసి తీరుతాడు
ఆపేటివాడు ఎవడు?
నియమింపబడిన దినములలో
ఒకటైనా కాకమునుపే
నను గూర్చి తనదు గ్రంధములో
వ్రాసి ఉంచినాడు
( భవిష్యత్ ఏమౌతుందోనన్న )
చరణం :- 2
నా పాపంకొరకు ప్రభువు
జగతికి ఉత్పత్తి మొదలు
వధియింపబడియున్నాడు
ఏదైనా సమస్య నాపై
దండెత్తి రాక మునుపే
పరిష్కారం సిద్ధపరుస్తాడు.
నా మేలు కొరకు అన్నియును
సమకూర్చి జరుపు ప్రభువు
నా పక్షమందు కార్యమును
సఫలపరచుతాడు.
( భవిష్యత్ ఏమౌతుందోనన్న )
చరణం :- 3
నాకేమి అవసరములో
నేనింకా అడగనపుడే
నా తండ్రికి ముందే తెలుసు.
నాకింక ఏమి కొదువ?
క్రీస్తేసు మహిమ వలన
సర్వ సమృద్ధి కలదు.
తన సొంత కొడుకునే నా కొరకు
యిచ్చేసినాడు తండ్రి
ఆయనతో పాటు అన్నియును
యిచ్చి తీరుతాడు
( భవిష్యత్ ఏమౌతుందోనన్న )
చరణం :- 4
మన దేవుని వాగ్దానములు
అన్నియును క్రీస్తునందు
అవును ఆమేన్ నాకు!
వాగ్దానం చేసినోడు ఎప్పుడూ నమ్మదగినవాడు
నాకసలు దిగులు లేదు.
ఈ భూమి కంటె ఆకాశములు
ఎంతెత్తుగా ఉన్నాయో
నా కొరకు ప్రభుని ఉద్దేశ్యములు
అంత ఉన్నతములు!
( భవిష్యత్ ఏమౌతుందోనన్న )
చరణం :- 5
తొట్రిల్లకుండ నన్ను
కాపాడగలిగినోడు
శక్తి గల రక్షకుండు.
తన మహిమ యెదుట నన్ను
నిర్దోషిగా నిలువబెట్టి – ఆనందిస్తున్నవాడు.
తన ఆత్మ చేత ముద్రించెను నను,
నా ప్రభువు వచ్చువరకు
నను తండ్రి చేతిలోనుండెవడు అపహరింపలేడు
( భవిష్యత్ ఏమౌతుందోనన్న )
English Lyrics :-
Naa Devudu Goppavaadu
Edainaa Cheyyagaladu
Prabhu Eppudu Oadipodu
Oadipodu Oadipodu
Sariyaina Samayamande
Rangamlo Dookutadu
Mundu Radu – Alasyamavvadu
Mundu Radu – Alasyamavvadu
Bhavishyat Emoutundonana
Bhayamu Ledu Naaku!
Repu Ye Malupu Undonana
Chinta Ledu Naaku!
Are! Naa Jeevitam – Prabhuni Chetulo (2)
Unchi Nenu Nischintaga Unna
Charanam – 1
Nenem Avvavaleno
Khachchitanga Telisinodu
Munde Nirnayinchinadu!
Nannemi Cheyyavaleno
Prabhu Chesi Tirutadu
Aapetivadu Evadu?
Niyamimpabadina Dinamulo
Okataina Kakamanupaye
Nanu Gurchi Tanadu Grandhamulo
Vrasi Unchinadu
(Bhavishyat Emoutundonana)
Charanam – 2
Naa Paapam Koraku Prabhuvu
Jagatiki Utpatti Modalu
Vadiyimpabadiyunnadu
Edaina Samasya Naapai
Dandetti Raka Munupe
Parishkaram Siddhaparustadu.
Naa Melu Koraku Anniyunu
Samakurchi Jarupu Prabhuvu
Naa Pakshamandu Karyamunu
Safalaparachutadu.
(Bhavishyat Emoutundonana)
Charanam – 3
Naakemi Avasaramulo
Neninka Adaganapude
Naa Tandriki Munde Telusu.
Naakinka Emi Koduva?
Kristhesu Mahima Valana
Sarva Samruddhi Kaladu.
Tana Sonta Kodukune Naa Koraku
Icchesinadu Tandri
Ayanato Paata Anniyunu
Icchi Tirutadu
(Bhavishyat Emoutundonana)
Charanam – 4
Mana Devuni Vaagdanamulu
Anniyunu Kristhunandu
Avunu Aamen Naaku!
Vaagdanam Chesinodu Eppudoo Namadaginavadu
Naakasalu Digulu Ledu.
Ee Bhoomi Kante Aakashamulu
Entettuga Unnaayo
Naa Koraku Prabhuni Uddeshyamulu
Anta Unnathamulu!
(Bhavishyat Emoutundonana)
Charanam – 5
Totrillakunda Nannu
Kaapadagaliginodu
Shakti Gala Rakshakundu.
Tana Mahima Yeduta Nannu
Nirdoshiga Nilabettinchi – Anandistunnavadu.
Tana Aatma Cheta Mudrinchenu Nanu,
Naa Prabhu Vachhuvaraku
Nanu Tandri Chetulonundevadu Apaharimpaledu
(Bhavishyat Emoutundonana)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Yesayya Song Lyrics :- Click Here