నీ కృపాతిశయము నా తుది శ్వాసవరకు Song Telugu Lyrics | Nee Krupathishayamu Song Lyrics | John Pradeep | Dr. Asher Andrew | The Life Temple
Nee Krupathishayamu Song Lyrics :-
పల్లవి:-
నీ కృపాతిశయమును అనునిత్యము
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
ఆ:పల్లవి:-
నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది
మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు
చరణం :- 1
ఇంకా బ్రతికి ఉన్నామంటే
కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే
కేవలము నీ కృపా
ఏ మంచితనము – లేకున్ననూ
కొనసాగించినది నీ కృపా
నిలబెట్టుకొన్నది నీ కృపా
( నీ కృపా )
చరణం :- 2
పది తరములుగా వెంటాడిన
మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా
మార్చేనే వెయ్యి తరములు
అన్యురాలైన ఆ రూతును
ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నన్ను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు
( నీ కృపా )
చరణం :- 3
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే
కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే
కేవలము నీ కృపా
కృపతోనే రక్షణనిచ్చావు
నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా ఋణస్థుడను
నీయందే నిత్యము అతిశయము
( నీ కృపా )
చరణం :- 4
ఇల్లు వాహనం ఉన్నాయంటే
నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే
నీదు కృపా దానమే
ఏ అర్హత నాలో లేకున్ననూ
కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను
జీవితమంతా పాడెదను
( నీ కృపా )
చరణం :- 5
ప్రియులే నన్ను విడనాడినా
శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే
నా కథ ముగిసినదే
నీ కుడిచేతిలో ఉంచగనే
బెన్యామీను వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము
విధిరాతనే మార్చెనే నీ కృపా
( నీ కృపా )
English Lyrics :-
Pallavi
Nii Krupātishayamunu Anunityamu
Nē Keertinchedā Tarataramulaku
Nii Vishvāsyatanu Nē Prachurintunu
A. Pallavi:
Nii Krupā Nii Krupā Ākāshamukante Hechhainadi
Mounigā Yetulundeda Sākshigā Prachurinchakā
Naa Thudi Shvāsa Varaku Nii Chenta Cherevaraku
Charanam 1
Inka Brathiki Unnāmante
Kevalamu Nii Krupā
Inka Sevalō Unnāmante
Kevalamu Nii Krupā
Ē Manchitanamu Lēkunnanū
Konasāginchinadi Nii Krupā
Nilabettukonnadi Nii Krupā
( Nii Krupā )
Charanam 2
Padi Taramulugā Ventādina
Mōyābu Shāpamu
Nii Krupanu Sharanu Vēdagā
Mārchene Veyyi Taramulu
Anyurālainā Ā Rūthunu
Dhanyurālugā Mārchinadi
Nii Krupayē Nannu Deevinchagā
Ē Shāpamu Nāpai Panicheyyadu
( Nii Krupā )
Charanam 3
Ārōgyam Udyōgam Unnāyantē
Kevalamu Nii Krupā
Methuku Brathuku Unnāyantē
Kevalamu Nii Krupā
Krupatōnē Rakshanamichāvu
Naa Kriyal Valana Kānē Kādu
Jeevitamantā Runa Sthudanu
Nīyandē Nityamu Atishayamu
( Nii Krupā )
Charanam 4
Illu Vāhanam Unnāyantē
Nīdu Krupādānāmē
Balamu Dhanamu Unnāyantē
Nīdu Krupā Dānāmē
Ē Arhata Nālō Lēkunnanū
Krupā Bhikshayē Nā Yedala
Jeevitamantā Krutajñudanu
Jeevitamantā Pādedanu
( Nii Krupā )
Charanam 5
Priyulē Nannu Vidanādina
Shōkamē Nā Lōkamā
Anādhagānē Migilānē
Nā Katha Mugisinadē
Nii Kudichētinlō Unchaganē
Benyamīnu Vantugā Māré
Aidantalāyē Nā Bhāgyamu
Vidhirātané Mārchene Nii Krupā
( Nii Krupā )
Watch Full Video :- Click Here
More Lyrics :-
El Shama Song Lyrics :- Click Here