ప్రేమించి నన్ను నా ప్రియ యేసు Lyrics Telugu | PREMINCHI NANNU Song Lyrics in Telugu | Joshua Shaik | Pranam Kamlakhar | Hemant Brijwasi
PREMINCHI NANNU Song Lyrics
పల్లవి :-
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా
చరణం :- 1
మార్గము నీవే – క్షేమము నీవే
చల్లగ చూసే – దేవుడ నీవే
ఈ బ్రతుకంతా – నీ పద చెంత
నా ప్రభు నీవే – అణువణువంతా
నీ కృపలోనే – నా బలమంతా
కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే – జీవితమంతా
నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ
చరణం :- 2
కొండలలోన – లోయలలోన
అండగా నీవై – నడిపిన దేవా
వేదనలోన – శోధనలోన
తోడుగా నీవై – నిలచిన దేవా
ఉన్నతమైన – నీ ఘనకార్యం
ఏమని వివరింతును
ఆశ్రయమైన – నీ సన్నిధానం
ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము
Watch Full Video :- Click Here
More Lyrics :-
AMMA Chupaledhu Lyrics :- Click Here