Raalipoye Puvvuku 4K Song Lyrics | రాలిపోయే పువ్వుకు Christian Song Lyrics Telugu | Bro. Seenanna | John Pradeep Halleluya Ministries Official
Raalipoye Puvvuku 4K Song :-
రాలిపోయె పువ్వుకు
ఎందుకిన్ని రంగులో
విడిచి వెళ్లే గూడుకు
ఎందుకిన్ని హంగులో (2)
అందమెంత ఉన్న
బందు బలగమెంత వున్న (2)
చరణం :- 1
అందమైన జీవితం రంగుల గాలిపటం
అందరి కన్నుల ముందు అందంగా ఆడును (2)
ఆధారమైన దారం అంటు ఉన్నంత వరకేగా (2)
తెగక మానునా తెగినంక ఆగునా
అది తెగక మానునా తెగినంక ఆగునా
ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును (2)
రంగులెమాయే పొంగులెమాయే
చెంగులేమాయే దాని హంగులెమాయే (2)
( రాలిపోయె పువ్వుకు )
చరణం :- 2
మాయల బ్రతుకులో మనుషుల జీవితం
కాదురా శాశ్వతం వున్నదంతా అశాశ్వతం (2)
క్షేమ కాలమంతా యేసయ్యను త్రోసివేసి (2)
వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా
ఇక వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా
దేవుని పిలిచిన కాపాడమని పలికిన (2)
మరణమన్నది కనికరించదు
నరకమున్నది అది జాలి చూపదు
( రాలిపోయె పువ్వుకు )
చరణం :- 3
మరణపు ముల్లును విరిచిన ధీరుడు
మరణము గెలిచిన సజీవుడై లేచిన (2)
ప్రభువైన యేసుక్రీస్తు తను
పిలచుచుండె నిన్ను (2)
పాపివైనను నీవు రోగివైనను
ఎంత పాపి వైనను నీవు రోగి వైనను
ప్రేమతో క్షమియించి పరలోక
రాజ్యమిచ్చును (2)
యేసే మార్గము యేసే జీవము
యేసేసత్యము యేసే నిత్య జీవము (2)
( రాలిపోయె పువ్వుకు )
English Lyrics :-
Pallavi:
Raali poye puvvuku
Endukinni rangulo
Vidichi velle gooduku
Endukinni hangulo (2)
Andamentha unna
Bandhu balagamentha vunna (2)
Charanam 1:
Andamaina jeevitham rangula galipatam
Andari kannula mundu andanga aadunu (2)
Aadharamaaina daaram antu unnanta varakega (2)
Tegaka maanuna teginaanka aguna
Adi tegaka maanuna teginaanka aguna
Ekkado kommaku chikkukoni chinugunu (2)
Rangulemaaye pongulemaaye
Chengulemaaye daani hangulemaaye (2)
(Raali poye puvvuku)
Charanam 2:
Mayala bratukulo manushula jeevitham
Kadurraa shaashvatam vunnadantaa ashaashvatam (2)
Kshemakaalamantaa Yesayyanu throsivesi (2)
Velluchundaga praanam povuchundaga
Ika velluchundaga praanam povuchundaga
Devuni pilichina kaapaadamani palikina (2)
Maranamannadi kanikarinchadu
Narakamunnadi adi jali choopadu
(Raali poye puvvuku)
Charanam 3:
Maranapu mullunu virichina dheerudu
Maranamu gelichina sajeevudai lechina (2)
Prabhuvaina Yesukristhu thanu
Piluchuchunde ninnu (2)
Paapivainanu neevu rogivainanu
Entha paapi vainanu neevu rogivainanu
Prematho kshamiyinchi paraloka
Raajyamichunu (2)
Yesey maargamu Yesey jeevamu
Yesey sathyamu Yesey nitya jeevamu (2)
(Raali poye puvvuku)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yedavaka Ooruko Song Lyrics :- Click Here