విలువైనది దేవా నీ ప్రేమ Song Lyrics | Viluvainadhi Yesayya Nee Krupa Song Lyrics Telugu | Sumanth Prasad | Pas. John J (Raja Ne Sannidhilone)
Viluvainadhi Yesayya Nee Krupa Song
పల్లవి :
విలువైనది దేవా నీ ప్రేమ
క్షణమైనా నన్ను మరువనిది
నా ప్రతి అడుగును స్థిరపరిచి
తొట్రిల్లనీయక కాపాడినది (2)
కృంగియున్న వేళలో ఆదరించిన కృప
జారియున్న స్థితిలో చేరదీసిన కృప (2)
వెలకట్టలేనిది శ్రేష్ఠమైన నీ కృప (2)
అ. పల్లవి :
ఆరాధనా నీకేనయ్యా నా గానము నీ కోసమే
ఆరాధనా నీకేనయ్యా నా జీవితం నీ సేవకే
చరణం :- 1
నీపై యున్న ప్రేమను వర్ణింప గోరగా
నాలో మార్పు తెచ్చిన సిలువ ప్రేమ కనబడెను (2)
ఆ ప్రేమను మించిన ప్రేమ లేదు ఇలలోన (2)
ఎలా బ్రతుకగలనయ్యా నీ తోడు లేకుండా
( ఆరాధనా నీకేనయ్యా )
చరణం :- 2
నీతో కలసి నేను పయనింప గోరగా
నా చేయి పట్టి నడిపించుచున్నావు (2)
నీ జతే ఉండగా భయము లేదు ఇలలోన (2)
ఎలా నిలువగలనయ్యా నీ తోడు లేకుండా
( ఆరాధనా నీకేనయ్యా )
చరణం :- 3
నీతో కలిసి నేను నివసింపగోరగ
నాకై నీవు స్థలమును సిద్ధపరచుచున్నావు (2)
నీ రాకకై నేను వేచియుంటి ఇలలోన (2)
నిను చేరు వరకు నిరీక్షణతో వేచెదా
( ఆరాధనా నీకేనయ్యా )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yesayya Ninu Polina Song :- Click Here