యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా Song Lyrics Telugu | Yesayya Naa Praanama Song Telugu Lyrics | Hosanna Ministries 2025 New Year Song
Yesayya Naa Praanama Song Lyrics :-
యేసయ్యా నా ప్రాణమా
ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే
ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను
నే అలయక నడిపించెను
నా జీవమా – నా స్తోత్రమా – నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాధ్యుడా
చరణం :- 1
చిరకాలము నాతో ఉంటానని
క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని
తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా (2)
ఏదైనా నాకున్న సంతోషము
నీతోనే కలిగున్న అనుబంధమే (2)
సృజనాత్మకమైన నీకృప చాలు
నే బ్రతికున్నది నీకోసమే (2)
( యేసయ్యా నా ప్రాణమా )
చరణం :- 2
జీవజలముగా నిలిచావని
జలనిధిగా నాలో ఉన్నావని
జనులకు దీవెనగ మార్చావని
జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా (2)
ఏదైనా నీకొరకు చేసేందుకు
ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2)
ఇదియే చాలును నా జీవితాంతము
ఇల నాకన్నియు నీవేకదా (2)
( యేసయ్యా నా ప్రాణమా )
చరణం :- 3
మధురముకాదా నీ నామధ్యానం
మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపు వైనం
క్షేమముగా నా – ఈ లోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా (2)
నిజమైన అనురాగం చూపావయ్యా
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
స్తుతుల సింహాసనం నీకొరకేగా
ఆసీనుడవై ననుపాలించవా (2)
( యేసయ్యా నా ప్రాణమా )
English Lyrics :-
Pallavi:
Yesayya naa pranamaa
Ghanamaina stutiganamaa
Adbhuthamaina nee aadarane
Aashrayamaina nee samrakshanaye
Nanu needaga ventaadenu
Ne alayaka nadipinchenu
Naa jeevamaa – naa stotramaa – neeke aaradhana
Naa snehama – sankshemama – neeve aaradhyudaa
Charanam – 1:
Chirakaalamu naatho untanani
Kshanamaina veedipoleedani
Neelo nanucherchukunnavani
Tandrito ekamai unnamani
Aanandagaanamu ne paadanaa (2)
Edainaa naakunna santoshama
Neetone kaligunna anubandhame (2)
Srujanaatmakamaina neekrupa chaalu
Ne bratikunnadi neekosame (2)
(Yesayya naa pranamaa)
Charanam – 2:
Jeevajalamuga nilichavani
Jalanidhiga naalo unnavani
Janulaku deevenaga maarchavani
Jagathilo saakshiga unchavani
Utsaahagaanamu ne paadanaa (2)
Edainaa neekoraku chesedaaniki
Ichchitivi balamaina nee shaktini (2)
Idi ye chaalunu naa jeevitaanthamu
Ila naakanniyu neevekadaa (2)
(Yesayya naa pranamaa)
Charanam – 3:
Madhuramukaadaa nee naamadhyaanam
Marupuraanidi nee premamadhuram
Melucheyuchu nanu nadupu vaina
Kshemamuga naa – ee lokapayanam
Stotrageetamuga ne paadanaa (2)
Nijamaina anuraagam choopavayya
Sthiramaina anubandham needenayya (2)
Stutula simhaasanam neekorakegaa
Aaseenudavai nanu paalinchavaa (2)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here