పరిస్థితులను మార్చగల ప్రార్ధన Song Lyrics Telugu | Paristhithulanu Marchagala Pradhana Lyrics | Methushelah P | Lillian Christopher Songs
Paristhithulanu Marchagala Pradhana Lyrics
పల్లవి:
పరిస్థితులను మార్చగల ప్రార్ధన
పరలోకమునిల దించగలిగిన ప్రార్ధన (2)
ప్రార్ధనే గొప్పశక్తి – ప్రార్ధనే దైవభక్తి
ప్రార్ధనే పాపముక్తి – ప్రార్ధనే జీవశక్తి
చరణం :- 1
మోషే ప్రార్ధన బండనుండి
నీటిని రప్పించెను
యెహోషువ ప్రార్ధన
సూర్యచంద్రులను నిలిపివేసెను (2)
నీవు ప్రార్ధిస్తే అసాధ్యమైనది
లేనేలేదు లేనేలేదు
నీవు ప్రార్థిస్తే అంతయు లోబడును
అంతయు లోబడును అంతయు లోబడును
( ప్రార్ధనే )
చరణం :- 2
దానియేలు ప్రార్ధన
సింహపునోళ్లను మూసివేసెను
పౌలు సీల ప్రార్ధన
చెరసాల తలుపులను తెరవజేసెను (2)
నీవు ప్రార్ధిస్తే పాతాళం మూయబడును
నీవు ప్రార్ధిస్తే పరలోకం తెరువబడును (2)
( ప్రార్ధనే )
చరణం :- 3
ఎస్తేరు ప్రార్ధన రాజాజ్ఞనే
తలక్రిందులు చేసెను
సంఘప్రార్ధన పేతురును
బయటకు రప్పించెను( 2)
నీవు ప్రార్ధిస్తే రాజ్యాలు తలక్రిందులే
నీవు ప్రార్ధిస్తే తొలగును బంధకాలే (2)
( ప్రార్ధనే )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Novahu Taatha Lyrics :- Click Here