ఓటికుండను నేను Christian Song Lyrics | Votikunda Song Lyrics in Telugu | Latest Telugu Christian Song 2024 | Paul Jacob | Votikundanu Lyrics
Votikunda Song Lyrics Telugu :-
ఓటికుండను నేను నను ఓదార్చుము
ఒంటిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము (2)
అలుసైనాను అందరికి
నలుసైనాను నా వారికీ (2)
గడిచిపోవునా నా గతి
మారిపోవునా నా స్థితి (2)
చరణం :- 1
తలరాత ఇంతేనని తల్లడిల్లగ
తన చెయ్యి నను నడిపే మెల్లమెల్లగా (2)
తన గాయము నా కోసమే కదా
ఈ కాయము యేసుకోసమే సదా (2)
ఈ కాయము యేసుకోసమే సదా
( ఓటికుండను )
చరణం :- 2
ప్రేమించనివారి పైన ప్రేమ చూపగా
ప్రేమించిన నీ మనసునే గాయపరచగా (2)
కనురెప్పయినా నను కాయకుండిన
కన్న తండ్రివి నను విడువకుంటివే (2)
కన్న తండ్రివి నను విడువకుంటివే
( ఓటికుండను )
చరణం :- 3
మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు
మీలాగ నన్ను ఎవరు ఆదరించగలరు (2)
ఈ లోకమే ఏకమై నిలచిన
నా పక్షమై నీవుంటే చాలయ్య (2)
నా పక్షమై నీవుంటే చాలయ్య
( ఓటికుండను )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yuddha Veerulam Lyrics :- Click Here