నను దీవించావు Song Lyrics | Nanu Deevinchavu Song Lyrics in Telugu | Sreshta Karmoji | Joel Suhas Karmoji | Telugu Christian Song 2024
Nanu Deevinchavu Song Lyrics :-
ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను
వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే (2)
చరణం :- 1
కష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు
( వందనాలు యేసయ్య )
చరణం :- 2
ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో
కలవరమును కరిగించి కరుణను కురిపించావు
నా భయమును గద్దించి నీ శాంతితో నింపావు
( వందనాలు యేసయ్య )
చరణం :- 3
కలిగేటి శోధనలు కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా సాగెను నా పాదములు
అపవాదిని నా చేత ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు
( వందనాలు యేసయ్య )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Noothana Kriyalu Song :- Click Here